Sunday, October 12, 2008

అధికారమే పరమావధిగా ప్రజారాజ్యం పార్టి అడుగులు -- జే.పి


విమర్శలు ప్రతివిమర్సలు రాజకీయాలలో సర్వసామాన్యం , ఎంతో లోతుగా ఆలోచించి మాట్లాడే వ్యక్తి లోక్ సత్తా పార్టీ వ్యవస్త్పకుడు జయప్రకాశ్ నారాయణ , ఎంతో వున్నత విలువలు కలిగిన మనిషి . సమాజానికి ఏదో చేద్దామని తన

ఐ . ఏ . ఎస్ ర్యాంక్ హోదాను వదులుకున్న వ్యక్తి కావటం ఇక్కడ ఆసక్తికర విషయం .

ఇది ప్రజారాజ్యం పార్టి ఆవిర్భావం మొదటనుంచి వక బిజినెస్ ఆలోచన ధోరణిలో సాగింది . ఎలాగైతే వక కంపెని వాళ్ల వస్తువు మార్కెట్లో అమ్ముడుపోయే విధంగా మార్కెట్ సర్వే చేయటం , దానికి వివిధ ప్రాంతాలలో వస్తువుగురించి ప్రచారము , డెమో ఇచ్చే వాలేంతీర్ స్టాఫ్ తో మరియు మార్కెట్లో వున్న ప్రొడక్ట్స్ తో ( కాంగ్రెస్ , తెలుగుదేశం ) ఎంతవరకు పోటి ఇవ్వగలము , ఇదే ధోరణిలో జరిగింది .

ప్రజాసేవకు ఇంత మార్కెటింగ్ నెట్వర్క్ అవసరము లేదు . వారి విధానం , సేవలు అర్ధమైతే ప్రజలు స్వాగతిస్తారు.

ఇకనైనా చిరంజీవి సినిమా డైలాగ్ లు ( పరచూరి , మరికొంత సినిమా రచయతలు వ్రాసిన ) మాని , తన సొంత ఆలోచనలతో , అల్లు అరవింద్ డైరక్షన్ లేకుండా , నిస్వార్ధం గ వుంటే అనడరకు మంచిది .


No comments: