Friday, November 28, 2008

ఆపరేషన్ ముంబై ముగిసింది ......................

ఆపరేషన్ ముంబై నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి . పోలీస్ ఆఫీసర్ లు " హేమంత్ కరికరే ", " విజయ్ సలేస్కర్ ", "అశోక్ కాంతే ", " ఉన్నికృష్ణన్ " ఇలా దాదాపు పదిహేడు పైగా ప్రాణాలు వదిలారు .
* ఇంటిల్లిజేన్స్ వైఫల్యం ముఖ్యం గ చెప్పుకో దగినది
* అండర్ వరల్డ్ కి టెర్రరిస్టు లతో లింక్స్ తెలుసుకోవాలి
* కోస్టల్ చెకింగ్ " కోస్ట్ గార్డు "
* పోలీస్ ఆఫీసర్ లకు పవర్ ఇచ్చి రాజకీయ జ్యోక్యం లేకుండా చెయ్యటం
* నరేంద్ర మోడి ప్రకటించినట్లు " వన్ క్రోర్ " కోసం పోలీస్ ఆఫీసర్ లు వర్క్ చెయ్యరు .
* ప్రజలకు పోలీస్ ఆఫీసర్ లకు మద్య ఆంత్యరం లేకుండా వొకరి నొకరు సపోర్ట్ చేసుకొంటూ భాద్యతగా వుండటం .

మూడవ రోజు తాజ్ లో కూడా ఆపరేషన్ క్లోసేడ్ ..






నలభై ఎనిమిది గంటల తరువాత ..........

* నారిమన్ హౌస్ లో ఐదు గురు హోస్తేగ్గ్ , ఇద్దరు టెర్రరిస్టు లు చనిపోయారు ..
* దాదాపు నూటయాభై ఐదు చనిపోగా , మూడువందల ముఫై పైగా గాయపడి చికిస్త పొందుతున్నారు ..
* ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్ కు ఎవిడన్స్ చూపింది టెర్రరిస్టు లకు పాకిస్తాన్ లింక్ వున్నదని ..
* తాజ్ హోటల్ లో ఫైరింగ్ కొనసాగుతుంది .........

ఇప్పటికైనా ప్రజలు మేలుకోండి మనమధ్య వున్న ఎంతో మంది టెర్రరిస్టు లకు ఏదోవిధంగా సహాయ పడుతున్నారు .
ముస్లిం ప్రజలు వొక్కసారి ఆలోచించండి ఇండియన్ ప్రజలు ప్రేమతో సహరిస్తారు , ఇండియా నుండి విదిపోఇన పాకిస్తాన్ , బంగ్లాదేశ్ ఎందుకు టెర్రరిస్టు లను పంపి ఇండియా మరియు ప్రపంచ దేశాలును భయ పెడుతూ వున్నది ?

రెండవ రోజు " టెర్రరిస్టు అటాక్ ఆన్ ముంబై "...


ముప్పః ఏడు గంటల తరువాత ........
* ఎన్.ఎస్.జి కామొండ్యో నరేమా హౌస్ ఫోర్త్ , ఫిఫ్త్ ఫ్లోర్ అకుపై చేసారు .
* వంద మందికి పైగా ఒబెరై హోటల్ నుండు విముక్తి పొందారు .
* తాజ్ హోటల్ లో తాజా కాల్పులు జరుగు తున్నై " పంనేడు నుండి పదిహేను బోడీస్" కమేన్దోస్ వివరించారు .
* రాజకీయ నాయకులూ " నరేంద్ర మోడి , విలాస్రావు దేశ్ముక్ " ఒబెరై వద్దకు వచ్చారు ..
* ఉగ్రవాదులు అధిక మొత్తంలో అమునషన్స్ , పదిడు వొందల విదేశి కరెన్సీ , ఏడు క్రెడిట్ కార్డ్స్, విదేశి ఐ.డి వున్నయ్.
* తాజ్ లో , నారిమన్ హౌస్ లో కాల్పులు జరుగుతూన్నాయి

Wednesday, November 26, 2008

ఉగ్రవాదులు ముంబైని టార్గెట్ చేసారు ......?





ఉగ్రవాదులు భారత వాణిజ్య రాజధాని ముంబై ని టార్గెట్ చేసుకొని కాల్పులకు , బాంబుబ్లాస్ట్ కి పాల్పడటం వలన .
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ..
యాభై ఐదు మంది పౌరులు, నలుగురు పోలిసులు చనిపోగా నూట తొంభై ఆరు మంది గాయపడ్డారు ....
ఏంటి టెర్రరిస్టు స్కోడ్ అదినేత హేమంత్ కర్కరే , ఎన్కౌంటర్ స్పెసిలిస్ట్ విజయ్ సలస్కర్ చనిపోఎన వారిలో వున్నారు ..
* దాదాపు ముప్పై పైగా ఉగ్రవాదులు ముంబాయిలో ప్రవేశించి గ్రూప్ లుగ విదిపొఏ
* చత్రపతి శివాజీ రైల్ టెర్మినల్ , తాజ్ హోటల్ , ఒబెరై హోటల్ , కామా హాస్పటల్ ప్రాంతాలలో విచాక్ష్నరహితంగా కాల్పులు జరిపారు ..
* దీనిని మొదట మాఫియా గంగ్స్తర్ మధ్య జరిగిన గొడవగా మొదట భావించారు ..
* తేరుకొని ఇది ఉగ్రవాదుల చర్యగా భావించి ఆపరేషన్ మొదులు పెట్టారు .
* మరొక పొరపాటు కామా హాస్పటల్ దగ్గర జరిగింది ఏంటి టెర్రరిస్టు స్కోడ్ అదినేత హేమంత్ కర్కరే , ఎన్కౌంటర్ స్పెసిలిస్ట్ విజయ్ సలస్కర్ కారు దిగి లోనికి వెళ్ళుతున్న సమయంలో ఎదురుగ వచ్చి అతిసమీపంనుంచి ఫైర్ చెయ్యటం వారు చనిపోఈన తరువాత ఉగ్రవాదులు పోలీస్ జీప్ హైజాక్ చేసి దానిని ఉపయోగించి కాల్పులు జరపటం టి.వి చూస్తున్న వారు అందరు చూసారు .. కాల్పులు ఒబెరై హోటల్ లో , నమిర హౌస్ లో జరుగుతున్నవి .
వివరాలు తెలియాల్సి వున్నది ........
** ఉగ్రవాదులు పాకిస్తానీ పంజాభి లో మాట్లాడుకోవటం ( పాకిస్తాన్ మూలాలు వున్నట్లు తెలుస్తూంది ).
ఉగ్రవాదులు తమ పంధా మార్చారు ....
** ఇప్పుడు ఆర్ధిక మూలాలు మీద ( షేర్ మార్కెట్ , కరెన్సీ, ఇండస్ట్రీ )
** విదేశి వ్యక్తులు భారత్ కి తరలి రాకుండా
** రాజకీయ నాయకులూ ( జాతీయ నాయకులూ )
** రాష్ట్ర నాయకులూ ( ఆర్ధికంగా ఎదుగుతున్న రాష్ట్రాలు )
** వ్యవసాయ క్షేత్రాలు ( పంట నష్టం జరగటం "నకిలీ మందులు ", " విత్తనాలు ")
ఇప్పుడు ఉగ్రవాదం పంధా మార్చుకుంటున్నారు , ఇది మనకు " వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ " టార్గెట్ చేసినప్పటినుంచి ఈరోజు ముంబై లో జరిగిన ఉగ్రవాద చేర్యాల వరకు మనకు ఎన్నో పాఠాలు . ముఖ్యంగ మన సెక్యూరిటీ ఆఫీసర్స్ , స్పెషల్ టీం కాని వొక రీసెర్చ్ వింగ్ " ప్రపంచం లో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగిన వాటి డేటా తెచ్చుకొని నాలెడ్జ్ పెంచుకొంటే " మంచిది . ఎందుకంటే ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా లింక్ నెట్వర్క్ వుండటం వలన "స్మాల్ టీం మోర్ రిసల్ట్ " పధకాలు ఎక్కువ అయ్యఈ . ఇప్పుడు ఎఫ్.బి.ఐ టీం లాస్ ఏంజిల్స్ నుంచి దర్యాప్తు కోసం వస్తున్నారు .
ముంబై ఆపరేషన్ అంత తేలికగా కొట్టిపారివేయ కూడదు .. ఇలాంటివి మరికొన్ని జరగటానికి ఎక్కువ అవకాసం వున్నాయే . ఆపరేషన్ ఇరువై నాలుగు గంటలు పైన జరుగుతున్నది లాస్ ఎక్కుమోత్తంలో వున్నది .
ఆలోచించండి దీనిని ఎదుర్కోవటానికి అందరు కృషి చేయాలి ... రాజకీయాలు చేయటానికి సమయం కాదు .
వొక్కసారి ఆలోచించండి ఇది విదంగా టెర్రరిస్టు ఎటాక్ న్యూయార్క్ పట్టణంలో జరిగితే ఇప్పటికే ఆర్ధిక సంఖోభంతో కొట్టుమిట్లడుతున్న అమెరికా ఎలా రియాక్ట్ అవుతారో ... వారు ముందు చూపుతో ముంబై ఆపరేషన్ ని ఇంవేస్తిగేత్ట్ చేసుకోవటానికి వస్తున్నారు ...

మీ నేతతో ముఖా .. ముఖి చర్చ ......


Monday, November 24, 2008

వై.ఎస్.ఆర్ డ్రీమ్ " హరితంద్ర ప్రదేశ్ " ఇదే మళ్ళి ముఖ్యమంత్రి ని చేస్తుంది ...


ముఖ్య మంత్రి వై.ఎస్.రాజశేకర రెడ్డి ప్రవేశ పెట్టిన పధకాలు ఇవే మరల తనను ముఖ్యమంత్రి పీఠం పై నిలుపుతుందని గట్టిగ నమ్ముతున్నాడు . అందుకే ఎవరెన్ని , ఎన్నిరకాల పొత్తులు పెట్టుకున్న విమర్శించిన తను లెక్కచేయక ప్రజలకు వాగ్దానం చేసినవి , తను చేద్దామనుకున్న పనులకు ఆలోచాలకు పడునపెట్టి వాటిని అమలుచేస్తూ ప్రజల మన్నలను ప్రోడుతూ సంతోశిస్తున్నాడు ... ఇవి చాలవా వ్యక్తీ , నాయకుడుగా , మహనీయుడుగా ఎదగటానికి ..
* రెండు రూపాయలకు కిలో బియ్యం
* ఆరోగ్యశ్రీ
* ఇందిరమ్మ ఇల్లు
* జలయజ్ఞం
* ఉచిత విద్యుత్తు
* డ్వాక్రా ( పావలా వడ్డీ )
* వంద రోజుల పనిదినాలు
* రాజీవ్ గృహకల్ప
* రాజీవ్ ఉద్యోగశ్రీ
ఇలా చెపుకుంటూ పోతే ఎన్నో ........... ఆలోచించితే ఎవరైనా వోప్పుకుంటారు ముఖ్యమంత్రి చేస్తున్న పనులు గొప్పవని . "స్వర్ణాంద్ర ప్రదేశ్ ", " సంతోశాంద్ర ప్రదేశ్ " ఇస్తామంటారు , ప్రజలు ఒకరికి తొమ్మిది సంవస్తరాలు అవకాసం ఇచ్చారు మాట నిలబెట్టుకోలేదు . మరి ఇప్పుడు మరొక కొత్త నాయకుడు అవకాసం కావాలని అంటున్నాడు . అవకాసం ఇవ్వటానికి ఇది పదికోట్లు తో తీసే సినిమా కాదు తొమ్మిది కోట్ల ప్రజల జీవితం . ఇప్పుడు కావలసింది కొత్తవారికి అవకాసం కాదు , జరుగుతున్నదానిలో లోపాలు సరిదిద్ది మరింత బాగా ప్రజలకు మేలు జరగటం .
మీ సూచనలు , అభిప్రాయాలూ మెయిల్ చేయ్యాది .,
మీ
సూరి

సుజలాం సుఫలాం అంటు జలయజ్ఞ ఫలాలు పొందుతున్న ప్రకాశం ప్రజలు ...







సి.పి.ఐ , టి.డి.పి పోత్తు కరారు ... చక్రం తిప్పిన చంద్రబాబు ...




చంద్ర బాబు కు జాతీయ రాజకీయ నాయకుల తో వున్న సన్నిహిత సంభంధాలు రాష్ట్ర రాజకీయ పోత్తులకు మార్గం సులభమైనది .. తన రాజకీయ చతురతతో కంమునిస్తులను తన వైపు త్రిప్పుకోన కొంతవరకు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి షాక్ ఇచ్చాడు ... మరి చిరంజీవి మరొక షాక్ కి సిద్దంగా వుండాలి ఈసారి వై.ఎస్.రాజశేకర రెడ్డి నుంచి ... వేచి చూడాలి ...?



Sunday, November 23, 2008

వై.ఎస్ వెంటే సాగుతాం అంటున్న ఉత్తరాంద్ర ప్రజలు .......


* చిరంజీవికి చురకలు ........


  • మీసాలు మెలేసి తోదగోట్టిన రాష్ట్ర స్తాయీ నాయకులూ ఎవ్వరు ప్రవర్తించలేదు ....?

  • మీసాలు మెలేస్తే ఓట్లు రాలవు .

  • మీసం మేలవేయతమేనా మార్పు .

  • సినిమాలో వక్కడు పదిమందిని కొడితే చప్పట్లు , విజిల్స్ వేస్తారు .. ప్రజా జీవితంలో కాదు .

  • మాకు ప్రజాసేవ మాత్రమే తెలుసు .

మరిన్ని విశేషాలు , ఫోటోలు ....

Saturday, November 22, 2008

రాష్ట్రంలో ఎన్నికల నగారా మ్రోగిస్తున్నారు .....?


రాష్టంలో ఎన్నికల నగారా మ్రోగింది , ఎన్నికలను తలపించే రీతిలో సభలు . పార్టీల మధ్య పొత్తులు మదలైనవి .

Friday, November 21, 2008

రాజశేకరుని ఎదుర్కో టానికి "ఇంద్రసేనా రెడ్డి " "సమరసింహా రెడ్డి " యాత్రలు ....


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పౌరుషానికి గుర్తుగా వుండే ప్రాంతాలు " పల్నాడు " , " రాయలసీమ " . ఇదే పౌరుషాన్ని సినిమా ప్రపంచం సినిమాలు తీసి సొమ్ము చేసుకున్నారు. అలనాటి" పల్నాటి యుద్ధం " , "బ్రహ్మనాయుడు " ఇక రాయలసీమ ఫాక్షన్ సినిమాలు "ప్రేమించుకొందాం రా..", "అంతఃపురం ", సమరసింహా రెడ్డి", "ఆది", "ఇంద్ర" . రాయల సీమ సినిమా ప్రపంచానికి ఎంతో వున్నత విలువలు గల దర్శకులు , నిర్మాతలును ఇవ్వటమే కాకుండా , రాజకీయం గా ఎంతోమంది నాయకులను స్వాతంత్ర సమయం కాలంనుండి మనరాస్త్రనికి ఇచ్చింది .
రాజకీయ నేతలు "నీలం సంజీవ రెడ్డి", " కోట్ల విజయభాస్కర రెడ్డి", " నార చంద్రబాబు నాయుడు ", " కే.ఈ . కృష్ణ మూర్తి ", "ఎం.వి. మైసూర రెడ్డి ", " పరిటాల రవి " ఇలా చెప్పుకొంటూ పోతే చాల మంది తేలుతున్నారు .. కాని రాయల సీమ అంటే టక్కున గుర్తుకొంచే నాయకుడు మన ముఖ్య మంత్రి డాక్టర్ . వై.ఎస్. రాజశేకర రెడ్డి సింబల్ . అందు వల్ల ప్రతి వోక్కరు పర్యటనలు చేస్తున్నారు .. కాని రాయలసీమ ప్రజలకు తెలుసు అభివృద్ధి చేసింది . మన మాజీ ముఖ్య మంత్రులు " నారా చంద్రబాబు నాయుడు ", హిందూపురం నుంచి గెలిచిన " నందమూరి తారక రామ రావు " ఎంతవరకు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందినాయో ప్రజలకు తెలుసు . ప్రజలు సినిమా లు చూస్తున్నారని వారికి ఎమితేలియదనుకొంటే పొరపాటే . సినిమాలలో మీసాలు మేలవేయడం , తోడ కొట్టడం చప్పట్లు కొట్టొచ్చు . రాజశేకర రెడ్డి మీసాలు మేలవేయాడు , తోడ కొట్టాడు . వారికీ ఏమి కావాలో అవి వారికి సమకూర్చుతున్నారు .
* జే.ఎన్.టి.యు
* ఐ .ఐ.ఐ.టి
* రిమ్స్ హాస్పిటల్
* వేమన యునివర్సిటీ
*సైన్సు సిటీ ( ప్రారంభం )
* నాలెడ్జ్ సెంటర్ .
* సాగునీటి ప్రాజెక్టులు
ఇలా చెప్పుకొంటూ పొతే ఎన్నో .. ఎన్నెన్నో ..
అందుకే వై. ఎస్ అంటే నమ్మకం ....
మీ
సూరి

Thursday, November 20, 2008

చిరంజీవి రాయలసీమ యాత్ర ..........

చిరంజీవి రాయలసీమ యాత్ర ఆర్దాంతం సినిమా డైలాగ్ లతో ప్రతి చూత ఎప్పుడో మూడు సంవత్సర క్రితం ఫాక్షన్ బ్యాక్ గ్రౌండ్ తో నిర్మిచిన " ఇంద్ర " సినిమా లో తను భూమిని ముద్దు పెట్టుకొని రాయలసీమలో వర్షం కురవాలని యజ్ఞం చేసానని . ఇప్పుడు ఆ వర్షం పడుతుందని పదే ... పదే వపోయ్యాడు ...
ఇక్కడ మాట అక్కడ చెబుతూ ప్రజలను తనవైపు త్రిప్పుకోతనికి ప్రయత్నిచాడని తెలుస్తూంది . రాయలసీమలో ఫాక్షన్ నిర్ములిస్తానని చెప్పి " మీసాలు మేలవేయటం , తోడ కొట్టటం " , ఫాక్షన్ బ్యాక్ గ్రౌండ్ వున్నా " భుమా నాగిరెడ్డి " చేరతీయటం . అందరికి ఒకింత అస్చ్యర్యము , అనుమానం కలుగక మానవు .. ప్రజలను కూడా వోట్లు వేస్తానికి వచ్చారా లేక నన్ను చూడటానికి వచ్చారా అని తెలుసుకోవటం .
వొక్క " పులివెందుల " సభలో మాత్రం కొంత బెదిరి పోఎనట్లు కనిపించింది . పులివెందుల అభివృద్దిని వొప్పుకొని " వై.ఎస్. సొంతవూరు గురించి కొంత తెలుసు కూవాలని వున్నదని కొంత వెటకారంగా మాట్లాడాడు ..
మొత్తంగా చూడటానికి మాత్రం జనం బాగా వచ్చారు , సీమ సంస్కృతి వల్ల ఆయన పర్యటన పెట్రోలు కర్చు .
మీ
సూరి

సాక్షి తో రామోజీ "ఇంటిగుట్టు" విప్పిన కొడుకు సుమన్


మాజీ "ఈ టివి" అధినేత సుమన్ అతని మిత్రుడు ప్రభాకర్ తో కలసి "సాక్షి " దినపత్రికకు మనసువిప్పి ఇన్నాళ్ళు తన తండ్రి రామోజీ రావు వల్ల పడ్డ భాధను , తనకు క్యాన్సర్ అని తెలిసి , తనకు ఎంతో ఇష్టమైన " ఈ-టివి " ని తన నుంచి బలవంతంగా లాక్కున్నాడని , తను కిమోతేరిపి చేయున్చుకొంట్టుంటే కనీసం జాలి పడని వ్యక్తి అని భాద పడ్డాడు .

Tuesday, November 18, 2008

ఫ్లాష్ న్యూస్ ... తొండూరు వద్ద ... చిరు గో బ్యాక్ నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు

కడప జిల్లాలో చిరు రోడ్ షో లో ... చిరు గో బ్యాక్ నినాదాలు చేస్తూ నల్ల జండాలతో ఎదురేగిన కాంగ్రెస్ కార్యకర్తలు ..
ఉత్కంతగా సాగుతున్న చిరు రోడ్ షో.... ఈ దాడిని తనకు అనుకూలంగా సొమ్ము చేసుకోవాలి ప్రజారాజ్యం నాయకుడు అల్లు అరవింద్ చూస్తున్నారు ... దాడిలో దెబ్బతిన్న వాహనాలను రాష్ట్రమంతా ప్రదర్సిస్స్తము అంటున్నారు ..
అల్లు అరవింద్ సినిమా ట్రిక్స్ ప్రజాస్వామ్యం లో చెయ్యవద్దు ..
పులివెందులలో వై.ఎస్.ఆర్ కి వున్న పేరును చేదకొట్ట తానికి పర్యటిస్తున్నారు ...
చిరు ఇది మీకు మీ పార్టీ కి మంచిది కాదు ...
మీ
సూరి

కడప జిల్లాలో ప్రవేశించిన చిరంజీవి ప్రజా అంకిత యాత్ర ...


ప్రజారాజ్యం పార్టీ నాయకులపై పై అల్లరి మూకల దాడి ....



పులివెందులలో వుద్రిక్తిత ........


ప్రజారాజ్యం పార్టీలో సామాజిక "వర్గ" న్యాయం ........

రాష్ట్రం లో కొత్తగా సామాజిక న్యాయం అని చేభుతూ పుట్టుకొచ్చిన పార్టీ "ప్రజారాజ్యం" .. ప్రజాస్వామ్యం కు పూర్తి విరుద్ధంగా వొక కుటుంభం " నాగబాబు , పవన్ కళ్యాణ్ , అల్లు అరవింద్ " వొక సామాజిక వర్గం " కాపు , బలిజ , ఒంటరి , నాయుడు " చేత ఏర్పడి ఇప్పుడు వోట్ల కోసం సామాజిక న్యాయం అంటున్నారు . నిజంగా ఆయనకు " చిరంజీవికి " సామాజిక న్యాయం తేవాలని వుంటే . ఒక నిమ్న కులం " ఇలా అనకూడదు , కానీ పత్రికలూ అంటున్నాయి " బి.సి , ఎస్.సి , ఎస్.టి లకు రాజ్యాది కారం " ముఖ్యమంత్రి " పదవి ఇచ్చి తాను మాత్రం అధికారానికి దూరంగా వుంటే అప్పుడు నమ్ముతాము నిజమైన సామాజిక న్యాయం ... ఇప్పటి వరకు సినిమాలలో కోట్లు సంపాదించి .. విలాసవంతమైన జీవితం అనుభవించి ... ఇప్పుడు తన స్థానం పోవటం తో తనకు ప్రజలలో వున్నా సిని గ్లామర్ ను అడ్డు పెట్టుకొని మరల వుంకొక సారి దోచుకోవటానికి పార్టీ పేరుతో వస్తున్నాడు ... చిరంజీవి అనుభవిస్తున్న ప్రతి పైసా రాష్ట్రంలో ఒక్కొక పేదవాడు , ధనికుడు టిక్కెట్టు రూపేన ఇచ్చిన దానం . వారు చూపిస్తున్న అభిమాననీ " రక్తం " సీసాల లో నింపి డబ్బులకు అమ్మటం . వారు దానం చేసిన " కళ్లు " , ఇప్పుడు వాళ్ల దానం తో పబ్లిసిటీ , వల్ల వోట్లు కాని వాళ్లకు వోరిగేది ఏంటి చివరకు .... సేవలుగా మారటం ... కొంతసేపు సంతాపం ... ఇదేనా చిరంజీవి కోరుకొనే మార్పు ... చిరంజీవికి కావలసింది " ముఖ్యమంత్రి " పదవి కాని ప్రజల సమస్యలు కాదు ... నిజంగా మార్పు కోరుకుంటే , తను నమ్మే గాంధీ లా ప్రజలకు సేవచేస్తూ పాలిచే అవకాసం మాత్రం తాను కోరుకున్న వేనుకుపడిన వర్గాలకు అవకాసం ఇవ్వండి " మీ సంకల్పం " నెరవేరు తుంది అప్పుడు తప్పక మీ పాదాలకు నమస్క రిస్తం ... ఇది మీరు చేయ గలరా ...?
చిరంజీవి గారు మీకు నిజంగా సమాజంలో వెనుక పడిన వర్గాల సేవ మీ ద్యేయం అయెతే దానిని ఆచరణలో చూపండి ..? అప్పుడు నమ్ముతాము ..... అలా కాకపోఇన నాడు మీరుకూడా మిగిలన రాజకీయ నాయకులూ లాంటి వాడినని .. ప్రజలను మోసం మాటలతో ఈమర్చుతున్నానని తెలుసు కొండి ...? మీకు ధైర్యం వుంటే సమాదానం చెప్పగలరు ...?
మీ
సూరి

రాయల సీమ లో " సమరసింహా రెడ్డి " పర్యటనకు రంగం సిద్ధం ..?


Monday, November 17, 2008

ప్రజారాజ్యం పార్టీ కి లేఖ వ్రాసి నట్లు ఒప్పుకొన్న.... హరిరామ జోగయ్య .


కాంగ్రెస్ సిని గ్లామర్ గ్రూప్ ఫోటో .....


ప్రజారాజ్యం పార్టీ గాని , చిరంజీవి కి గాలి వుందా .. హరిరామ జోగయ్య





చిరు ఆలోచనలు అమలు చేస్తే రాష్ట్రం ఇరువై సంత్సరాలు వెనుకకు .. వై.ఎస్


సిని గ్లామర్ ఆకట్టుకొంటున్న రోడ్ షో ... దీనికి ప్రజల ప్రాణాలు బలి ..


చిరంజీవి ఘరానా మొగుడు ఫంక్షన్ గుంటూరు లో జరిగి నప్పుడు తొక్కిసలాటలో విద్యుత్ ఘటానికి ప్రజలు బలైయ్యారు , ప్రజారాజ్యం పార్టీ వ్యస్తాపక సభకు హాజరై వెళ్ళుతూ ప్రజలు చనిపోయారు , శ్రీకాకుళం యాత్రలో తొక్కిసలాటలో ప్రజలు చనిపోయారు , ఇప్పుడు అనంతపురం యాత్రలో తొక్కిసలాటలో ప్రజలు చనిపోయారు ..
చిరంజీవికి అతని ప్రజారాజ్యం పార్టీకి వోట్లు అధికారం కావలి అందుకోసం వీధి ... వీధికి తిరుగుతున్నాడు .
దీనితో అతనికి కావలసిన వోట్లు రాబట్టుకున్తున్నాడు .. కాని ప్రజలు వారి విలువైన సమయం తో పాటు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు .. దీనిగురించి ప్రజారాజ్యం అధినీత చిరంజీవి ఏమి సమాధానం చెబుతారు .
మీ
సూరి

రాజకీయ మార్పు అవసరమా ..............?

ప్రపంచ వ్యాప్తంగా అక్కడ వున్న సామాజిక , ఆర్ధిక , రాజకీయ పరిస్థితుల కారణంగా మార్పులు వస్తున్నవి. ఇదే విధంగా మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎన్.టి. రామారావు తెలుగుదేశం ఆవిర్భావంతో కొంత సామాజిక , రాజకీయ మార్పు వచ్చినమాట వాస్తవం . కాని అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా . ప్రజలు తెలుగుదేశం కు బ్రహ్మరధం పట్టారు . అప్పుడుకూడా తెలుగుదేశం కు సి.పి.ఐ , సి.పి.ఎం , బి.జే.పి ఇతర సంగాలు మద్దతు పలికాయి. దానివలన మార్గ సులభమైనది . అప్పుడు వలసలు కంటే , సమాజంలో వున్న యువకులు ఎక్కువ ఆసక్తి చూపారు .
ఇప్పటి తెలుగుదేశం , టి.ఆర్.ఎస్ పెద్దనాయకులు , ప్రజారాజ్యం లోని వలస పక్షులు అలా నాయకులూ ఐనవారే .
ఇప్పటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు , ప్రజల అవగాహనా చాల మెరుగు పడింది . అప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యన్యయం గ కమ్యూనిస్ట్ పార్టీలు వున్నా అంత ప్రభావం చూపలేక పోవటం . సినిమా గ్లామర్ , రామారావు వాక్చాతుర్యం కలిసి వచ్చినవి .
చిరంజీవి మరియు ప్రజారాజ్యం నేతలు చెబుతున్నట్లు ప్రజలు మార్పు కోరుకుంటున్నారా లేక " కాపు , బలిజ " కులస్తులకోసం , వారి రాజ్యదికరం కోసం చూస్తున్నారా ......? వోకప్రక్క తెలగాణ లో టి.ఆర్.ఎస్ , నవ తెలంగాణా ప్రజా పార్టీ . తెలంగాణా కావాలని ఇన్ని సమస్యలతో వున్నప్పుడు .. ప్రజలు ఎలాంటి మార్పు కూరుకొంతున్నారు... అలా మార్పు కూరుకొంటే , పార్టీల కంటే నాయకులను మార్పు కోరుకుంటారు . వ్యవస్తలో మార్పు కావాలంటే అది ప్రజలలోనిచి కావలి కాని . వొక సినిమా గ్లామర్ వున్న వ్యక్తీ పార్టీ పెట్టి మైక్ పోట్టుకొని నాకు అధికారం ఇవ్వండి మార్పు తీసుకు వస్తా నంటే . ఎలా నమ్మాలి .? అమెరిక లో కూడా " వోభామ " మార్పూ తెస్తానన్నాడు దానికి ఆర్ధిక , రాజకీయ పరిస్థితులు మరియు "నల్లజాతి " వారికి అధికారం కోసం చాన సమత్సరలుగా రాజకీయ అవకాసం కోసం చూడటం . అన్ని కలిసి వచ్చిన అంసం . చిరంజీవిని ఏకారణం గా నాయకుడు అనుకోవాలి .....?
దయ చేసి మార్పు ఎలాకావాలి మీ అభిప్రాయాలను పొందు పరచండి ...
మీ
సూరి

Sunday, November 16, 2008

చిరంజీవి గారికి ఒక లేఖ .........

" కొణిదల శివశంకర వరప్రసాద్ " చిరంజీవి గారికి నా లేఖ .
* సెజ్ ల గురించి పోరాటం అన్నారు ?
* కోస్టల్ కారిడార్ గురించి పోరాటం అన్నారు ?
* జలయజ్ఞం ధన యజ్ఞం అన్నారు ...?
* కమ్మ , రెడ్డి కులాలే పరిపలిచారు అన్నారు .. అదే కులాలను చేరతీస్తున్నారు ...?
* ఇప్పుడు రాయలసీమ లో ఏమి అభివృద్ధి చేయలేదు అంటున్నారు ..?

వొక్కసారి మీ పార్టీ లో చేరిన వారు ఎలా ప్రజలకు సేవ చేసారో తెలుసుకోండి .
* తమ్మినేని సీతారాం
* భుమా నాగిరెడ్డి , శోభ నాగిరెడ్డి
* విద్యాధర రావు
* శివశంకర్
* సి.రామచంద్రయ్య
మీరు సమైక్య వాది గా చెప్పుకొంతున్నర , లేక తెలగాణ కు సపోర్ట్ చేస్తున్నారా ....? మీకు ధైర్యం వుంటే మీ విధానం బహిరం గ ప్రకటించండి .. మీరు విమర్చిని వాటికీ కట్టుబడి ప్రాజెక్ట్లు విసిట్ చేసి అప్పుడు చెప్పండి . ప్రకటనలు చెయ్యటం మానండి .
ప్రశ్న లు వేయటం చాల తేలిక , పనిచేయటం అంత సులభం కాదు .... మీకు తెలుసు ఇన్ని పధకాలు , అభివృద్ధి వొక్క ఐదు సంవత్సరాలలో చెయ్యటం కష్టం అని మీకు తెలుసు .... మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు ఆరోగ్యశ్రీ పధకాన్ని హేళన చేయకండి . ఎంతో మందికి లబ్ది చేకూరుతున్నది . కూరగాయలు రైతులు పండిస్తున్నారు కనుక వాటి ధర తగ్గిస్తే నష్టపోఎది రైతులు . వారికి మీలాగా పది కోట్లు రెమ్యునిరేషన్ రాదు . మీరు బాగా సంపాదించి మీ భవిషత్తు కోసం రాజకీయాలలోకి వచ్చారు . దానిని ప్రజాసేవ అని చెప్పకండి . మీకు అభివృద్ధి గురించి తెలుసుకోవాలంటే మొదట మీ పార్టీ లో కి వలస వస్తున్నా వారి నియోజక వర్గాలలోకి వెళ్లి వాళ్ళు ఎలా చేసారో తెలుసుకోండి . వొక వేలు చూపిస్తే నాలుగు వెళ్ళు మీ వైపుకు చూపిస్తాయని తెలుసుకోండి .
మీకు కళ్లు వుంటే వొక్కసారి తమ్మినేని సీతారాం ఇంటర్వ్యూ ఎన్ టి వి పాయింట్ బ్లాంక్ లో చూడండి .
" బలిజ , వంటరి , మున్నూరు కాపు , కాపు , కొండ రెడ్డి " ఇలా కొన్ని కులాలను కలుపుకొని నాకు ఇంత బలం వున్నదని చూసుకొంటున్నావు . చూస్తూ వుండు నీకు ప్రజలు ఎలా భుద్ది తెప్తారో .
మరికొన్ని త్వరలో పొందు పరుస్తా ...........
మీ
సూరి

అనతపురం లో చిరు సభ సక్సెస్ .......



Saturday, November 15, 2008

సామాజక న్యాయం " నిశబ్ద విప్లవం " ........ వై.ఎస్.ఆర్


పులివెందుల లో ప్రజారాజ్యం పార్టీ కి చుక్కెదురు ...


నా బ్లాగ్ లో నేను వ్రాసిన విధం గానే ప్రజారాజ్యం కి పార్టీ కి ఎవరు సహకరించారు . పులివెందుల ప్రజలు వై.ఎస్. రాజశేకర రెడ్డి ని కాదని ... ఎవరికీ సహకరించారు . చిరు తన మర్యాద కాపాడు కోవాలంటే అక్కడ వై.ఎస్ ను విమర్శించ వద్దు . పులివెందుల ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చెయ్యలేదు . ఆ విశ్వాసం వారు మరిచి పోలేరు .

ప్రజారాజ్యం పార్టీ కి చిరంజీవి కి కచ్చితం గా అవమానం తప్పదు. రాజశేకర్ రెడ్డి నమ్మిన వారిని వదులుకోరు .

ఇది ఒక్క పులివెందుల ప్రజల కే కాదు " నేను కూడా ప్రత్యక్షంగా చూసాను "

మీ

సూరి

చిరంజీవి కి పొన్నాల బహిరంగ సమాధానం ....


"వ్యుధ్య రాజ్యం " ప్రజారాజ్యం కాదు ......


ప్రజారాజ్యం చెప్పేది యువత రాజకీయాలను , సమాజాన్ని మార్పు తేవాలని చెప్పే చిరంజీవి , ఆచరణలో మాత్రంలో అమలుచేయ్యలేక పోతున్నారు . ప్రజారాజ్యం పార్టీ లో చేరిన వ్యక్తుల వివరాలు పొందు పర్స్తున్నాము ..
* చిరంజీవి
* కే .ఎస్.ఆర్ మూర్తి
* మిత్ర
* హరిరామ జోగయ్య .
* విద్యాసాగర రావు
* యలమంచిలి శివాజీ
*ఉపేంద్ర
* శివశంకర్
* మసాల ఈరన్న

Friday, November 14, 2008

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివశంకర్ "ప్రజారాజ్యం" లో చేరారు ... ఉపేంద్ర కూడా చేరుతున్నాడు...







రత్నబిందు ప్రజారాజ్యం పార్టీ లోకి వెళ్ళవచ్చు ...... రెండు సంవస్తరాల తరువాత , అప్పుడు కూడా చిరంజీవి పార్టీ గెలిచి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ...? చిరంజీవి సామాజిక వర్గం వాళ్ళు , ఎక్కడ అసెంబ్లీ సీట్ రాని వాళ్ళు ప్రజారాజ్యం లో చేరుతున్నారు .....

మాకు కచ్చితంగా రెడువోదల ముప్పై సీట్లు ... వై.ఎస్ .. ధీమా


వై.ఎస్.ఆర్ పై సవాల్ .. విసురు తున్న ... చిరు .


"చిరంజీవి " పులివెందుల కెళ్ళి వై.ఎస్.ఆర్ & వై.ఎస్.జగన్ ను ఎదురుకో గలరా ..........?


చిరంజీవి సినిమాలో మెగాస్టార్ ... మరి ఆంధ్ర ప్రదేశ్ కి రాజకీయ మెగాస్టార్ ఎవరని అడిగితే టక్కున గుర్తుకొచ్చే పేరు ... వై.ఎస్. రాజశేకర రెడ్డి . ఎన్.టి. రామారావు తరువాత అంత మాస్ ఫాలో వున్నా వ్యక్తి . రాజకీయంగా శత్రువులు వున్నా వ్యక్తిగతంగా అజాత శత్రువు . నమ్మిన వారికి ప్రాణం ఇచ్చే వ్యక్తీ . అందువల్లెనే పులివెందుల ప్రజలు గత ముప్పై సమస్తరాలుగా వై.ఎస్ కుటుంభం ను ఎన్నుకొంతున్నారు . అందుకనే చిరంజీవి తన రాజకీయ ఇమేజ్ ని పెంచుకోవటానికి వై.ఎస్.ఆర్ ను విమర్శించటం మొదలు పెట్టాడు .
చిరంజీవి ఒకానొక సమయంలో కడప వుత్సవాలలో ... రాజశేకర రెడ్డి కడపను డెవలప్ చేసినట్లు నేనుకూడా నా సొంత వూరును చేస్తాననో లేదో అని చెప్పాడు . అదే విదంగా " సాక్షి " దినపత్రిక సభలో జగన్ కు వొక విజన్ వున్నది అందుకే లాంగ్ టర్న్ విజన్ తో దీనిని కష్టమైన చాలెంజ్ గ తీసుకున్నాడు ...... ఇవి చిరంజీవి మరచి పోయాడో ఏమో వొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొంటే చాల మంచిది ...
మీ
సూరి

Thursday, November 13, 2008

పొన్నాలకు "చిరంజీవి" లేఖ .....


"చిరంజీవి " గారు మీరు " ప్రజారాజ్యం " పార్టీ పేరు మొదలుకొని అన్ని వేరొకరిని నుంచి చేజిక్కించుకొంటూ . టి.డి.పి , సి.పి.ఎం , కాంగ్రెస్ పార్టీ ల నుంచి వలసలను ప్రోస్తాహిస్తూ , మీ యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభిచారు . మీకు ప్రజలపై అంత అభిమానం వుండి ప్రజలకు సేవ చెయ్యాలని అనుకుంటే . ప్రాజక్టుల పేరుతో ప్రభుత్వ , ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని అనుకుంటే . నాలుగు సంవస్తారగా ఎందుకు వేచి వున్నారు . ఇప్పిడు మీ "రాజకీయ" లబ్ది కోసం . మనసు " బి.సి " అని , "సామాజిక న్యాయం " అని పదే పదే చెబుతావు , నీకు అంత సామాజక న్యాయం వుంటే .. మీ చిన్న కూతురు ఎవరినో పెళ్లి చేసుకుంటే . మీరు , పవన్ కళ్యాణ్ మరియు అల్లు అరవింద్ ఏ విధంగా ప్రవర్తించారో అందరికి తెలుసు . ఎన్నో వేషాలు వేస్తూ ప్రజలను మభ్య పెట్టకండి .
అవును ప్రాజెక్ట్లు అనుకున్నా దానికంటే సమయం ఎక్కువ అవటం వల్ల కొంత కర్చు పెరిగిన మాట వాస్తవం .
అవినీతి అన్ని ప్రభుత్వాలలో జరుగుతున్నది . మీరు రేపు ముఖ్యమంత్రి అయెతే అవినీతి జరగదని ప్రజలకు హామీ ఇవ్వలగలరా ....? ఇతరులను విమర్శించే ముందు మనము ఎంతవరకు న్యాయం గా ప్రవర్తిస్తున్నాము తెలుసుకోండి .
వేషాలు సినిమాలలో చూసాము నిజజీవితంలో చిరంజీవిని , అతని అభిమానులను చూసాము . నేను చిరంజీవిని సినిమాలలో అభిమనిచా ... కాని అది నటన అని తెలుసుకున్నాను ... మీకు మీమీద నమ్మకం వుంటే వేరే పార్టీలలో వాళ్ళను ప్రోస్తాహిచకండి . అప్పుడు అందరు అభిమనిస్తాము .
ఇప్పటివరకు మీకు సినిమా నటుడుగా అందరికి అభిమానం వున్నది . అదే విదంగా కొన్ని సమస్తరాలు కస్టపడి రాజకీయ లక్ష్యం కూడా నెరవేర్చుకొంది. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కనకండి .
అబ్దుల్ కలాం కూడా కలలు కనండి వాటి సాకారం కోసం కష్టపడండి అని చెప్పాడు . మీరు కూడా కష్టపడండి . అంతేకానీ మీ స్వార్ధం కోసం " బి.సి , ఎస్ .సి , ఎస్.టి " " రెడ్డి , కమ్మ , బలిజ " అని వర్గాలుగా విడకోత్తకండి . మీ సినిమా వేషాలకు , డైరక్షన్ కి, మీ బిజినెస్ లకు " కమ్మ , రెడ్డి " కులాల వారు కావాలి . వోట్లు కోసం మాత్రం " సామాజక న్యాయం " ... "బి.సి " అన్ని పుట్టుకోస్తున్నాయే .......?
మీరు కులాల వారిగా నాయకుల తో సమావేశం అవ్వటం మంచిది కాదు ..
మీ
సూరి

వై.ఎస్.ఆర్ కి పల్నాడు ప్రజల నీరాజనం ......