Friday, October 10, 2008

మార్పు సమాజం లో రావాలి , దానిని ప్రజలే తేవాలి ...


"మార్పు " ఇది అమెరికాలో , ఇండియాలో ఎన్నికలవేళ వింటున్న మాట . మార్పు కావలి , అది ప్రజలలోనుంచి రావాలి . బరాక్ ఒబామా దగ్గర్నుంచి ఆంధ్ర లో చిరంజీవి వరకు అంటున్న మాట .
బరాక్ ఒబామా వివిధ హోదాలో ఎదిగిన నాయుకుడు , మరి చిరంజీవి ముప్పై సంవస్తరాలు సినిమా ప్రపంచంలో ఎదిగిని మనిషి . సమాజం గురించి తెలుసుకోటానికి మరింతసమయం పడుతుంది . కాని తను రాత్రికి రాత్రే నాయకుడు అవ్వలనుకోవటం అంత సమంగాసం కాదు . దీనివల్ల సమాజానికీ మేలు కంటే కీడు ఎక్కువ జరగటానికి ఆస్కారం వున్నది.
నేను చిరంజీవికి వ్యతిరేకిని కాను , ప్రస్తుత సమయంలో సమర్ధవంతమైన నాయకత్వం మనకు కావలి .
అవినీతి
లచగొందితనం
భందుప్రీతి
కుల , మత , వర్గ , ప్రాంతీయ విభేదాలు
నిరిద్యోగం
అన్నిటికి సమాధానం "అక్షరాస్యత ", ఇది కొంతవరకు మార్పు తీసుకు రాగలదు , వొక్క నిరిద్యోగం కి తప్ప .
చదువుకున్న వారు "సమాజంలో జరుగుతున్న విషయాలు , మనము ఎలా ఎదుర్కోవాలి" అన్ని విషయాలు చదువుకొని వారికీ అర్ధం అయ్యే విధంగా చెప్పండి . ఇదే మనము సమాజానికీ చేయగలిగిన వుపకారం .


విజ్ఞానం, వివేకం, సహనం , ఎదుటివారిని అర్ధం చేసుకో గలిగితే -- మార్పు త్వరగా తీసుకు రాగలరు.



మీ


సూరి

No comments: