Monday, November 17, 2008

రాజకీయ మార్పు అవసరమా ..............?

ప్రపంచ వ్యాప్తంగా అక్కడ వున్న సామాజిక , ఆర్ధిక , రాజకీయ పరిస్థితుల కారణంగా మార్పులు వస్తున్నవి. ఇదే విధంగా మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎన్.టి. రామారావు తెలుగుదేశం ఆవిర్భావంతో కొంత సామాజిక , రాజకీయ మార్పు వచ్చినమాట వాస్తవం . కాని అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా . ప్రజలు తెలుగుదేశం కు బ్రహ్మరధం పట్టారు . అప్పుడుకూడా తెలుగుదేశం కు సి.పి.ఐ , సి.పి.ఎం , బి.జే.పి ఇతర సంగాలు మద్దతు పలికాయి. దానివలన మార్గ సులభమైనది . అప్పుడు వలసలు కంటే , సమాజంలో వున్న యువకులు ఎక్కువ ఆసక్తి చూపారు .
ఇప్పటి తెలుగుదేశం , టి.ఆర్.ఎస్ పెద్దనాయకులు , ప్రజారాజ్యం లోని వలస పక్షులు అలా నాయకులూ ఐనవారే .
ఇప్పటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు , ప్రజల అవగాహనా చాల మెరుగు పడింది . అప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యన్యయం గ కమ్యూనిస్ట్ పార్టీలు వున్నా అంత ప్రభావం చూపలేక పోవటం . సినిమా గ్లామర్ , రామారావు వాక్చాతుర్యం కలిసి వచ్చినవి .
చిరంజీవి మరియు ప్రజారాజ్యం నేతలు చెబుతున్నట్లు ప్రజలు మార్పు కోరుకుంటున్నారా లేక " కాపు , బలిజ " కులస్తులకోసం , వారి రాజ్యదికరం కోసం చూస్తున్నారా ......? వోకప్రక్క తెలగాణ లో టి.ఆర్.ఎస్ , నవ తెలంగాణా ప్రజా పార్టీ . తెలంగాణా కావాలని ఇన్ని సమస్యలతో వున్నప్పుడు .. ప్రజలు ఎలాంటి మార్పు కూరుకొంతున్నారు... అలా మార్పు కూరుకొంటే , పార్టీల కంటే నాయకులను మార్పు కోరుకుంటారు . వ్యవస్తలో మార్పు కావాలంటే అది ప్రజలలోనిచి కావలి కాని . వొక సినిమా గ్లామర్ వున్న వ్యక్తీ పార్టీ పెట్టి మైక్ పోట్టుకొని నాకు అధికారం ఇవ్వండి మార్పు తీసుకు వస్తా నంటే . ఎలా నమ్మాలి .? అమెరిక లో కూడా " వోభామ " మార్పూ తెస్తానన్నాడు దానికి ఆర్ధిక , రాజకీయ పరిస్థితులు మరియు "నల్లజాతి " వారికి అధికారం కోసం చాన సమత్సరలుగా రాజకీయ అవకాసం కోసం చూడటం . అన్ని కలిసి వచ్చిన అంసం . చిరంజీవిని ఏకారణం గా నాయకుడు అనుకోవాలి .....?
దయ చేసి మార్పు ఎలాకావాలి మీ అభిప్రాయాలను పొందు పరచండి ...
మీ
సూరి

No comments: