
"చిరంజీవి " గారు మీరు " ప్రజారాజ్యం " పార్టీ పేరు మొదలుకొని అన్ని వేరొకరిని నుంచి చేజిక్కించుకొంటూ . టి.డి.పి , సి.పి.ఎం , కాంగ్రెస్ పార్టీ ల నుంచి వలసలను ప్రోస్తాహిస్తూ , మీ యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభిచారు . మీకు ప్రజలపై అంత అభిమానం వుండి ప్రజలకు సేవ చెయ్యాలని అనుకుంటే . ప్రాజక్టుల పేరుతో ప్రభుత్వ , ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని అనుకుంటే . నాలుగు సంవస్తారగా ఎందుకు వేచి వున్నారు . ఇప్పిడు మీ "రాజకీయ" లబ్ది కోసం . మనసు " బి.సి " అని , "సామాజిక న్యాయం " అని పదే పదే చెబుతావు , నీకు అంత సామాజక న్యాయం వుంటే .. మీ చిన్న కూతురు ఎవరినో పెళ్లి చేసుకుంటే . మీరు , పవన్ కళ్యాణ్ మరియు అల్లు అరవింద్ ఏ విధంగా ప్రవర్తించారో అందరికి తెలుసు . ఎన్నో వేషాలు వేస్తూ ప్రజలను మభ్య పెట్టకండి .
అవును ప్రాజెక్ట్లు అనుకున్నా దానికంటే సమయం ఎక్కువ అవటం వల్ల కొంత కర్చు పెరిగిన మాట వాస్తవం .
అవినీతి అన్ని ప్రభుత్వాలలో జరుగుతున్నది . మీరు రేపు ముఖ్యమంత్రి అయెతే అవినీతి జరగదని ప్రజలకు హామీ ఇవ్వలగలరా ....? ఇతరులను విమర్శించే ముందు మనము ఎంతవరకు న్యాయం గా ప్రవర్తిస్తున్నాము తెలుసుకోండి .
వేషాలు సినిమాలలో చూసాము నిజజీవితంలో చిరంజీవిని , అతని అభిమానులను చూసాము . నేను చిరంజీవిని సినిమాలలో అభిమనిచా ... కాని అది నటన అని తెలుసుకున్నాను ... మీకు మీమీద నమ్మకం వుంటే వేరే పార్టీలలో వాళ్ళను ప్రోస్తాహిచకండి . అప్పుడు అందరు అభిమనిస్తాము .
ఇప్పటివరకు మీకు సినిమా నటుడుగా అందరికి అభిమానం వున్నది . అదే విదంగా కొన్ని సమస్తరాలు కస్టపడి రాజకీయ లక్ష్యం కూడా నెరవేర్చుకొంది. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కనకండి .
అబ్దుల్ కలాం కూడా కలలు కనండి వాటి సాకారం కోసం కష్టపడండి అని చెప్పాడు . మీరు కూడా కష్టపడండి . అంతేకానీ మీ స్వార్ధం కోసం " బి.సి , ఎస్ .సి , ఎస్.టి " " రెడ్డి , కమ్మ , బలిజ " అని వర్గాలుగా విడకోత్తకండి . మీ సినిమా వేషాలకు , డైరక్షన్ కి, మీ బిజినెస్ లకు " కమ్మ , రెడ్డి " కులాల వారు కావాలి . వోట్లు కోసం మాత్రం " సామాజక న్యాయం " ... "బి.సి " అన్ని పుట్టుకోస్తున్నాయే .......?
మీరు కులాల వారిగా నాయకుల తో సమావేశం అవ్వటం మంచిది కాదు ..
మీ
సూరి
No comments:
Post a Comment