Sunday, December 21, 2008

ఊహకు అందని వోటరు మనోగతం .......?


ఈసారి ఆంధ్ర ప్రదేశ్ ఎలెక్షన్ దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది ..? కారణం ఒక్కటే . దేశం మొత్తంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పదకొండు అందులో వొక్క ఆంధ్ర ప్రదేశ్ మాత్రమె పెద్ద రాష్ట్రం . అది కాక దేశం మొత్తం మీద గుజరాత్ ముఖ్య మంత్రి తరువాత అంత మొండిగటం వై.ఎస్ . రాజశేకర రెడ్డి అని ఇప్పటి సర్వేల ద్వార తెలుస్తుంది.
పైన పేర్కొన్న వివరాలు బట్టి ఎవరికైనా తెలుస్తుంది ఎన్.టి. రామా రావు పార్టీ పెట్టనత వరకు కాంగ్రెస్ పార్టీ ఎకచేత్రదాదిపత్యం . మళ్ళి ఇప్పుడు చిరంజీవి రూపంలో మరో సినీ దిగ్గజం ప్రజారాజ్యం పేరుతో వస్తున్నాడు .
మళ్ళి ఎన్. టి. రామా రావు లాంటిదే జరుగుతుందా ...? సభలకు , రోడ్ షో లకు వచ్చే ప్రజా ఆదరణ చూస్తె అందరు అలాగే అనుకొంటారు . కాని ఇటివల జరుగుతున్న పరిణామాలు చూస్తె అందుకు విరుద్దంగా వున్నవి .
రాష్ట్రంలో పొత్తుల పరంపర కొనసాగుతుంటే ప్రజారాజ్యం పార్టీ వైపు ఎవరు ఆసక్తి చూపకపోవటం ఇందుకు బలాన్ని చేకూర్చింది .
ముంబై మీద టెర్రరిస్టు అట్టాక్ వల్ల భారత్ / పాక్ మధ్య యుద్దవతవరణం నెలకొంది .. యుద్ధం జరిగే దానికి ఎక్కువ అవకాసం వున్నది . అదే జరిగితే ప్రజల నిర్ణయం మారవచ్చు .

No comments: