Sunday, December 14, 2008

రాబోయే ఎన్నికలు ప్రతిపక్షాలకు మరియు ప్రభుత్వానికి పరీక్ష ....?


మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో వోటరు తీర్పు చానా కచ్చితంగా వున్నదని స్పష్టమైనది .
బి.జే .పి టెర్రర్ నినాదం కూడా ఖాతరు చేయకుండా ప్రజలు అభివృద్ధి వైపు వోటు వేసారు . టెర్రర్ అనేది వొక పార్టీకి సంభందించింది కాదని అబివృద్ది , ప్రజాసేవ , నిరిద్యోగం అనేవి చాల ముఖ్యంమని వారివుద్దేస్యం స్పష్టంగా తెలిపారు .
**** రాష్ట్ర అభివృద్ధి ( ఐదు సంవత్సరాలలో ఎలా జరిగిందీ )
**** ప్రజాసేవ ( ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిచారు )
**** నిరిద్యోగం ( ఇది చాల ముఖ్యం యువత వోట్లు దీనినే ప్రభావితం చేస్తవి )
**** మహిళా , రైతు సమస్యలు
వీటిమీద ఎక్కువగా దృష్టి పెడితే గెలిచే అవకాశాలు చాల ఎక్కువ .....
వివిధ పధకాలు ( ఆరోగ్యశ్రీ , ఇందిరమ్మ ఇల్లు , రెండు రూపాయలకు కిలో బియ్యం ) చాలావరకు ప్రజలకు చేరువ అవుతున్నవి .
మనరాష్ట్రం విషయంలో కూడా ఇదే ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా వున్నవి .
--------------------------------------------------------------------------------------------
ఇక ప్రతిపక్షంది మరో గడ్డు సమస్య , ఏ వొక్క పార్టీ కి స్పష్టమైన బలం లేకపోవటం , వీరిమద్య పూర్తి అవగాహన లేకపోవటం ( వొక్క రాజశేకర రెడ్డి ని వోదించటం తప్ప ). మరొక విషయం ఏమిటంటే చిరంజీవి రూపంలో టి.డి.పి కి విజయావకాశాలు చాల వోరకు గండికోడుతున్నాయే . దీని వల్ల మరో ఐదేళ్లు ప్రతిపక్ష్మలో కూర్చోవాల్సి వస్తుందేమోనని చంద్రబాబు నాయుడు లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది . చిరంజీవి శిభిరం కూడా గెలుపుకంటే దీని మీదే ఎక్కువ ఆధారపడింది , ఎందుకంటే టి.డి.పి బలహీనపడితే రాష్ట్రంలో రెండో పెద్ద పార్టీగా అర్హత కొట్టొచ్చు .
మరియు టి.డి.పి శ్రేణులు తనవైపు త్రిప్పుకోవచ్చు .
మీ
సూరి

No comments: